యూకేలో కరోనా కొత్త వేరియంట్.. కేంద్రం ప్రామాణిక నిబంధనలు..

274
New variant of coronavirus
- Advertisement -

యూకేలో బయటపడిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎపిడెమియోలాజికల్ నిఘా రెస్పాన్స్ కోసం కేంద్రం ప్రామాణిక నిబంధనలు విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల అంతర్జాతీయ విమానాశ్రయాలలో యూకే నుంచి వచ్చిన వారికి ఆర్టీ పిసిఆర్ పరీక్షలు నిర్వహించాలి. పాజిటివ్ అని తేలితే స్పైక్ జెనెరేటెడ్ ఆర్టీ పిసిఆర్ పరీక్షకు పంపించాలి. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఇన్స్టిట్యూషనల్ క్వారన్ టైన్‌కు తరలించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాడు విమానాశ్రయాలలో నెగటివ్ వచ్చిన వారిని కూడా హోమ్ క్వారన్ టైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ప్రామాణిక నిబంధనల సమాచారం ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణికులకు అందజేయాలి. ఆర్టీ పిసిఆర్ పరీక్ష ఫలితం వచ్చే వరకు ఎయిర్ పోర్ట్ అథారిటీతో కలిసి ప్రయాణికులకు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.

ఇక 21 నుండి 23 తేదీ మధ్యలో వివిధ ఎయిర్ పోర్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని ఇన్స్టిట్యూషనల్ క్వారన్ టైన్‌కు తరలించాలి. 21 నుండి 23 తేదీ మధ్యలో వివిధ ఎయిర్ పోర్టుల్లో నెగటివ్ వచ్చిన వారు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. నెగటివ్ వచ్చిన వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిత్య పర్యవేక్షణలో ఉండాలి. 25 నవంబర్ నుండి 8 వ తేదీ డిసెంబర్ వరకు యూకే నుండి వచ్చిన ప్రయాణికులు స్థానిక అధికారులకు సమాచారాన్ని అందజేయాలి. ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా ఆర్టీ పిసిఆర్ పరీక్ష చేసుకోవాలి. విదేశీ ప్రయాణికులు ఎవరికి పాజిటివ్ వచ్చిన కాంటాక్స్ అందరిని ఇన్స్టిట్యూషనల్ క్వారన్ టైన్‌కు తరలించాలని కేంద్రం నిబంధనలు జారీ చేసింది.

- Advertisement -