గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 విజేత అభిజిత్..

318

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేత అభిజిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేతగా నిలిచిన సందర్భంగా ఏదైన మంచి కార్యక్రమం చేయాలి అన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తనతోపాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక , కళ్యాణిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అభిజిత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ,కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ స్పందించారు ట్విట్టర్ ద్వారా అభిజిత్ కు ధన్యవాదాలు తెలిపారు.