హీరోయిన్‌ రకుల్‌ కు కరోనా పాజిటీవ్‌..

46
rakul

టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలిపింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని రకుల్‌ తెలిపింది. ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరోవైపు, రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్ తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఇటీవ‌లే ర‌కుల్ మాల్దీవులు వెకేష‌న్ టూర్ లో స‌ర‌దాగా ఎంజాయ్ చేసిన విష‌యం తెలిసిందే.