విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్‌కు మద్దతుగా తెలంగాణ విద్యుత్ జేఏసి నిలుస్తుందని జేఏసీ నేత అంజయ్య అన్నారు..ఈరోజు విద్యుత్ సౌధలో జేఏసి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగులతో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ మా విద్యుత్ ఉద్యోగులకు,రైతులకు అండగా ఉండడం హర్షణీయం. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యుత్ సంస్కరణలు అమలు చేయం అనడం చాలా గొప్ప విషయం. రైతులకు సీఎం అండగా ఉన్నాడని మారోసారి రుజువు చేశారని అంజయ్య తెలిపారు.
రైతుల,పేదల పొట్టలు కొట్టడమే విద్యుత్ సవరణ బిల్లు లక్ష్యం. ధనవంతులకు కొమ్ముకాసే బిల్లు విద్యుత్ సవరణ బిల్లు. రాష్టాల్లోని విద్యుత్ సంస్థల ఆస్తులను అమ్మేసేందుకే బిల్లు తెస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా, విద్యుత్ ఉద్యోగులకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనీకుడు. సీఎం మాట్లాడిన అంశాలతో అయిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఎంప్లాయిస్ జేఏసీ శివాజీ మాట్లాడుతూ.. విద్యుత్ సవరణల పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కొంతమంది కార్పొరేట్ల కోసమో విద్యుత్ సవరణ బిల్లు తీసుకొస్తున్నారు. కాస్ట్ ఆఫ్ యూనిట్ పెరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే కారణం. స్మార్ట్ మీటర్, ప్రిపైడ్ మీటర్ ఉంటే రైతులకు ఇబ్బందే అని ధ్వజమెత్తారు. దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది.సంవత్సరానికి 12 వేల కోట్లు విద్యుత్ డిపార్ట్మెంట్ కు రాష్ట్రం నిధులు ఇస్తుందన్నారు.
రాష్ట్రం, వినియోగదారుల హక్కులను కేంద్రం తన పరిధిలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ సవరణ బిల్లుకు ఉద్యోగులు పూర్తి వ్యతిరేకం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం.. విద్యుత్ సవరణల బిల్లుకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేసే ఉద్యమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.