ఫైవ్ స్టార్….స్మశానం

259
- Advertisement -

మృత్యువు. ఈ పదం అంటే మనలో భయం లేనిదెవరికి? ఈ చావును తప్పించుకోవటానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఒక మనిషి బతకడని తెలిసిన తరువాత కూడా చివరి క్షణం వరకూ అతణ్ణి బతికించటం కోసం చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. లక్షలు ఖర్చు చేసేందుకైనా వెనుకాడం.. మనకు చావంటే అంత భయం. మరి చనిపోయిన తర్వాత??? ప్రతి మనిషి వెళ్ళాల్సిన చోటు ఒక్కటే. స్మశానం అతి పవిత్రం..

cemetery

సాధారణంగా స్మశానం అంటే ఊరి చివరలో…పాడు బడ్డ స్థలంలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్మశానం ఇందుకు పూర్తి భిన్నం. చూడటానికి ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లా….చుట్టు పచ్చని చెట్లు…అందులో ముచ్చటగొలిపే వాటర్‌ ఫౌంటేన్‌లు.. నెమలి పార్క్‌.. ఓ జలపాతం.. ఆకలి తీర్చే ఫలహారశాల.. ప్రార్థనలు చేసుకోవటానికి ఓ పెద్ద చర్చి….ఆకర్షణీయంగా కనిపించే ఇది ఓ శ్మశానం.

cemetery

108 మీటర్ల అందమైన భవనం.. 35 అంతస్తులతో బ్రెజిల్‌లోని సాంటోస్‌లో ఈ శ్మశానం ఉంది. దీనిపేరు ‘మెమోరియల్‌ నెక్రోపోల్‌ ఎక్యుమెనికా’. 1986లో ఈ శ్మశానాన్ని నిర్మించారు. కానీ అప్పట్లో ఇది చాలా చిన్నది. క్రమేపీ దీనిని విస్తరించాలని నిర్ణయించుకున్న స్థానికులు.. అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే దానిని చూస్తే నిజంగా ఫైవ్‌స్టార్‌ హోటలనే భావన కలుగుతుంది. ఆధునిక ఆకాశ హర్మ్యాలకి ఏమాత్రం తీసిపోని భవనం అది.

cemetery

25,000 మృతదేహాలు ఇమిడిపోయే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఇందులో ఉన్న 32 ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌కి దాదాపు 150 సమాధులు,అందులో ఒక్కోదానిలో ఆరు మృతదేహాలు పడతాయి. ఇందులో సమాధి చేసే మృతదేహాలు దాదాపు 3 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయట.ఈ భవనంలో కావాల్సిన అంతస్తుల్లో మృతదేహాల్ని భద్రపరుచుకోటానికి 5వేల నుంచి 20,000 డాలర్ల వరకు ఖర్చవుతుందట. ప్రపంచంలోనే అతిపెద్ద స్మశానంగా పేరుపొందింది.

- Advertisement -