బ్రెజిల్‌కు కోవాగ్జిన్ టీకాలు..

124
covid

బ్రెజిల్‌కు రెండు కోట్ల కోవాగ్జిన్ టీకాలను అందజేయనుంది హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ. ఇందుకు సంబంధించి భార‌త్ బ‌యోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది బ్రెజిల్ ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ.

ప్ర‌స్తుతం బ్రెజిల్‌లో రెండ‌వ ద‌ఫా క‌రోనా వైర‌స్ కేసులు విజృంభిస్తుండగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో 251498 మంది మృతిచెందారు. గురువారం ఒక్క రోజే 1541 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది బ్రెజిల్. మార్చి నుంచి మే నెల వ‌ర‌కు కోవిడ్ టీకా డోసుల‌ను డెలివ‌రీ చేయ‌నున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు మూడు ల‌క్ష‌ల డాల‌ర్లు ఉంటుంద‌ని బ్రెజిల్ పేర్కొంది. మార్చి నెల‌లో తొలి 80 ల‌క్ష‌ల టీకా డోసులు బ్రెజిల్‌కు చేర‌నున్నాయి.