త్రయం హిందీ రైట్స్

196
- Advertisement -

రోజు రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది . పెద్ద చిత్రాలకు ధీటుగా చిన్న చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి . సినిమాలో విషయం ఉండాలి కానీ బాషా బేధం లేకుండా మంచి ధరలు ప.లుకుతున్నాయి . ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న చిత్రం త్రయం అందరూ కొత్త వాళ్లే అయిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రం ట్రైలర్ విడుదల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది . ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం హిందీ రైట్స్ నీ ఒక ప్రముఖ సంస్థ మంచి రేటు తో సొంతం చేసుకుంది . గౌతమ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ నాయుడు నిర్మించారు . ఇదే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నహాలు చేస్తున్నారు . ఈ సినిమాకు సంగీతం : ఎస్ .వి హెచ్ కెమెరా : శివ రెడ్డి , ఎడిటర్ : రామారావు జెపి.

Trayam

- Advertisement -