న‌టి ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌..

92
Actor Kushboo
- Advertisement -

ప్రముఖ న‌టి, రాజ‌కీయ నాయ‌కురాలు ఖుష్బూకు హ్యాకర్స్ షాకిచ్చారు. ఆమె ట్విట్ట‌ర్ అకౌంట్‌ను హాక్ చేశారు. గత మూడ్రోజులుగా ఆమె ఖాతా హ్యాకర్ల అధీనంలోనే ఉన్నట్టు గుర్తించారు. దీనిపై ఖుష్బూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, దీనిపై ట్విట్టర్ బృందంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. గత మూడ్రోజులుగా తన ఖాతాలో పోస్టు అయిన ట్వీట్లు తనవి కావని స్పష్టం చేశారు.

అంతే కాదు.. మూడు రోజుల నుంచి పాస్‌వ‌ర్డ్ మార్చడానికి ప్ర‌య‌త్నిస్తుంటే వీలుకావ‌డం లేదని, ఆ విష‌యంలో అభిమానులు సాయం చేయాల‌ని కోరారు. ట్విట్ట‌ర్ కూడా ఎలాంటి స‌హాయం చేయ‌డం లేద‌ని, నా అకౌంట్‌ను స‌స్పెండ్ చేస్తామ‌ని అంటున్నార‌ని ఖుష్బూ తెలిపారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌డం లేద‌ని, ఎవ‌రైనా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కరిస్తే వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తాన‌ని ఆమె తెలిపారు.

కాగా ఖుష్బూ అకౌంట్‌ హ్యాక్ కావడం ఇది రెండోసారి. ఇదివరకు ఏప్రిల్ 2020లో ఓసారి హ్యాక్ చేశారు. ఈసారి హ్యాక‌ర్‌.. ఖుష్బూ ట్విట్టర్ పేరుని బ్రియాన్‌గా మార్చేయ‌డ‌మే కాదు.. ట్విట్ట‌ర్‌లో ఆమె ఫొటోను కూడా మార్చేశాడు. ఖుష్బూ ట్వీట్స్, పోస్టుల‌న్నీ డిలీట్ అయ్యాయి. త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింద‌నే విష‌యం తెలిసింది.

- Advertisement -