తెలంగాణలో భూముల విలువ పెంపు.. ఉత్తర్వులు జారీ..

115
Lands rate
- Advertisement -

తెలంగాణలో భూముల విలువను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు జీవోలో పేర్కొంది. దీంతో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువ పెరిగింది. ఎల్లుండి నుంచి పెరిగిన భూముల ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు పాత ధరలు కొనసాగింపునకు ఒక్కరోజే గడువు ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తారు. తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని దీని కోసం అధ్యయనానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. వీటిపై కేబినెట్‌లో చర్చించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో భూముల ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

- Advertisement -