తన అల్లరి తో థియేటర్స్ లలో నవ్వులు పూయించే అల్లరి నరేష్ , తాజాగా తన ఇంట్లో అల్లరి పెట్టడానికి ఓ చిన్నారి వచ్చింది..ఆమె నరేష్ కూతురు. టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ తండ్రయ్యాడు. ఇన్ని రోజులు వరకు వెండితెర మీద అల్లరి హీరోగా ఉన్న నరేష్ ఇంట మరింత నవ్వులు కనిపించనున్నాయి. గత ఏడాది మేలో విరుపతో నరేష్ వివాహం ఘనంగా జరిగింది. కాగా ఇవాళ నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది.
తను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న నరేష్ అందమైన కూతురు జన్మించడం తన అదృష్టం అంటూ ట్వీట్ చేశాడు. మరో యంగ్ హీరో నాని, హీరోయిన్ ప్రియమణి… నరేష్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.
‘టీచర్ : నువ్వు బాగా అల్లరి చేస్తున్నావ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్?
స్టూడెంట్ : అల్లరి నరేష్
ఇట్స్ ఏ బేబీ గర్ల్
కంగ్రాట్స్ బాబాయ్’ అంటూ నరేష్ పాపను ఎత్తుకున్న ఫోటో తో సహా ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం నరేష్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొంతకాలంగా సరైన హిట్ లేకుండా సతమతం అవుతున్న నరేష్ కు పాప ఎంట్రీ తో అన్ని మంచి రోజులే రావాలని కోరుకుందాం..