కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో చేసిన భరత్ అనే మూవీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన రెండు రోజులలోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల క్లబ్ లో చేరి నాన్ బాహుబలి సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి ది బిగినింగ్, బాహిబలి ది కన్ క్లూజన్ సినిమాలు కాకుండా అత్యంత త్వరగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్లు భరత్ అనే నేను టీం ఆనందం వ్యక్తం చేసింది.
మరోవైపు ఓవర్సీస్ పరంగా కూడా మహేష్ సత్తా చూపించాడు. అమెరికాలోఇప్పటికే ఈ మూవీ 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇదే తరహాలో కలెక్షన్స్ వస్తే బాహుబలి తర్వాతి స్థానంలో నిలుస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోనూ ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ ట్వీట్ చేశాడు. ఆస్ట్ర్టేలియాలో వసూళ్ల పరంగా భరత్ అనే చిత్రంలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. పద్మావత్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా. కైరా అద్వాణీ కథాయిక. దేవీశ్రీప్రసాద్ స్వరాలు అందించారు. కొరటాల-మహేష్ కాంబోలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా కూడా మంచి విషయాన్ని అందుకుంది. మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘భరత్ అనే నేను’ కూడా మంచి విజయంతో దూసుకుపోతోంది.