చెర్రీ కొత్త చిత్ర షూటింగ్ ప్రారంభం..

237
Ram Charan joins Boyapati Srinu’s film shoot from today
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. ఇటీవ‌లే విడుద‌లై రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శ్రీను డైరెక్ట‌ర్‌గా ఓ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆదివారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతున్న‌ట్లు తెలిపుతూ.. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది చిత్ర యూనిట్.

 Ram Charan joins Boyapati Srinu’s film shoot from today

అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజ‌కార్య‌క్రమాల్లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్న‌ప్పుడు ఫోటోను తీసి చ‌ర‌ణ్ 12వ సినిమాకు అంతా సిద్ధ‌మైంది. గుడ్ ల‌క్ మిస్ట‌ర్ సి చ‌ర‌ణ్ అంటూ ట్విట్ చేసింది ఉపాస‌న‌. ఈ చిత్రంలో చెర్రీ కొత్త‌గ క‌నిపించ‌టం కోసం చ‌ర‌ణ్ చేస్తున్న క‌స‌ర‌త్తులు అంతా ఇంతా కాదు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ న‌టీ కైరా అద్వాణీ న‌టిస్తుండ‌గా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -