ఆ వార్తల్లో నిజం లేదు:కొరటాల శివ

346
koratala siva
- Advertisement -

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అగ్రహీరోల అటెన్షన్ తన వైపు తిప్పకున్న కొరటాల తనపై వస్తున్న రూమర్లపై స్పందించారు.

భరత్ అనే నేను సినిమాతో మహేష్‌ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కమిట్‌మెంట్ ఇచ్చిన రెమ్యునరేషన్ శివకు డీవీవీ ఇవ్వలేదని టీ టౌన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వార్తలను ఖండించారు కొరటాల శివ. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పూర్తి రెమ్యునరేషన్ చెల్లించారని…తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం వచ్చిందన్నారు. రామానాయుడు తర్వాత అంత మంచి మనసున్న వ్యక్తి డీవీవీ దానయ్య అని చెప్పారు.

- Advertisement -