త‌మ్ముడి సవాల్‎ని స్వీక‌రించిన అన్న‌..

286
JR.Ntr and Kalyan Ram
- Advertisement -

ఐస్ బ‌కెట్, రైస్ బ‌కెట్ చాలెంజ్ మాదరిగా.. ఇప్పుడు ‘హ‌మ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్ అనే ఛాలెంజ్‎ని‘ కేంద్ర మంత్రి రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ మొద‌లుపెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ ఛాలెంజ్‎లో కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా పాల్గొంటున్నారు. ఈ ఛాలెంజ్‎కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

Kalyanram

ఇక ఈ ఛాలెంజ్‎ని మ‌ల‌యాల మెగాస్టార్ మోహ‌న్‎లాల్ స్వీక‌రించి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‎కు స‌వాల్ విసిరాడు. ఈ స‌వాల్ ను స్వీక‌రించిన ఎన్టీఆర్ జిమ్ ట్రైన‌ర్ ఆధ్వ‌ర్యంలో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశాడు.ఇక ఎన్టీఆర్ కూడా క‌ళ్యాణ్ రామ్, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్, రాజ‌మౌళి, కొర‌టాల శివల‌కు ఈ ఛాలెంజ్ విసిరాడు.

ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‎కి అన్న క‌ళ్యాణ్ రామ్ స్పందించాడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ నాన్న అంటూ జిమ్‎లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. ఇక క‌ళ్యాణ్ రామ్ కూడా అల్లు అర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్, రామ్‎ల‌కు ఛాలెంజ్ విసిరాడు.

మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని పెంచేశాయి. ఇందులో త‌మన్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్‎లో క‌నిపించ‌నున్నాడు.

- Advertisement -