టాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్న బాలీవుడ్ డైరెక్ట‌ర్?

306
swetha, rohit
- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో హీరో, హీరోయిన్ లు ప్రేమించుకోవడం స‌ర్వ సాధార‌ణ‌మ‌ని మ‌న‌కు తెలిసిందే. కొంత మంది ప్రేమించి వ‌దిలేస్తే.. మ‌రికొంత మంది మాత్రం ఆ ప్రేమ‌ను పెళ్లి వ‌ర‌కూ తీసుకెళ్తున్నారు. తాజాగా మ‌రో సిని జంట పెళ్లి పిఠ‌లెక్కుతున్న‌ట్టు స‌మాచారం. టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బ‌సుప్రసాద్ బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ మిట్ట‌ల్ తో శ్వేతా బ‌సుప్ర‌సాద్ ప్రేమ‌లో ప‌డింద‌ని తెలుస్తుంది. అయితే విరిద్ద‌రి క‌లిసి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ని స‌మాచారం. గ‌తంలో శ్వేత బ‌సుప్ర‌సాద్ కొన్ని తెలుగు సినిమాల్లో న‌టించింది. కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

swetha, rohit

కొత్త‌బంగారులోకం సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించినా ఆమెకు అంత‌గా అవ‌కాశాలు రాలేదు. తెలుగులో అవ‌కాశాలు ఎక్కువ‌గా రాక‌పోవ‌డంతో బాలీవుడ్, కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. అక్క‌డ కూడా ఆమె సినిమాలు హిట్ సాధించ‌క‌పోవ‌డంతో ఆమె నిరాశ‌కు గురైంది. గ‌తంలో ఓ సారి సెక్స్ రాకెట్ లో కూడా శ్వేతా బ‌సుప్రసాద్ అడ్డంగా బుక్క‌యిన విష‌యం తెలిసిందే. సినిమాలో అవ‌కాశాలు లేక ఇలాంటి ప‌నులు చేయాల్సి వ‌స్తుంద‌ని పోలిసుల‌తో తెలిపింది.

swetha, rohit

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్ ను పెళ్లి చేసుకోబుతుంద‌నే వార్త గ‌త కొద్ది రోజుల‌నుండి వినిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. రోహిత్ మొద‌ట తానే ప్ర‌పోజ్ చేశాన‌ని తెలిపింది. ఆత‌ర్వాత పూణెలో రోహిత్ త‌న ప్రేమ‌ను అంగిక‌రించాడ‌ని చెప్పింది. త‌మ ప్రేమ‌కు ఇంట్లో వాళ్లు కూడా అంగీక‌రించార‌ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపింది. త‌మ ఇద్ద‌రికి సంబంధించిన వ్య‌క్తి గ‌త జీవితాల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం గురించి తాము ఆలోచించ‌డం లేద‌న్నారు. ప్రస్తుతం శ్వేత ఓ బాలీవుడ్ చిత్రంతో పాటు తెలుగులో ‘గ్యాంగ్ స్టర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

shweta

- Advertisement -