నిరంతర శ్రామికుడు… హరీష్

261
harish rao, ktr
- Advertisement -

భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 45వ జన్మదినోత్సవ వేడుకలు బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఘనంగా జరిగాయి. తన 45వ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు తన తల్లి లక్ష్మీ ఆశీర్వాదం తీసుకున్నారు.

పలువురు ప్రజాప్రతినిధులు హరీశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌కు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిరంతర శ్రామికుడు, ప్రభావంతమైన వ్యక్తి హరీష్‌రావు అని ట్వీట్ చేశారు. హరీశ్‌రావు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

హరీష్ రావుకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు. కేకులు, పూల బోకేలతో మంత్రిని కలిసి‌ శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలు సైతం మంత్రి హరీష్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు హరీశ్‌.

- Advertisement -