ల…కొడుకు అని తిట్టిన రొడ్రిగో

231
Obama"son of Whore "!
Obama"son of Whore "!
- Advertisement -

అమెరికా ప్రెసిడెంట్ ఒబామాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒబామాను ల…కొడకా అంటూ బూతు మాట అనేశారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ. ఏకంగా ఒబామాను ల….కొడకా అంటూ తిట్టారు. దీంతో రోడ్రిగోతో జరగాల్సిన తొలి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు ఒబామా.
అయితే జరిగిన విషయం ఏంటంటే.. రొడ్రిగో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడైన తర్వాత డ్రగ్స్ మాఫియాపై యుద్ధం పేరుతో వందలాది మందిని చంపేశారు. దీనిపై ఒబామా స్పందిస్తూ.. మాఫియా పేరుతో మానవహక్కుల ఉల్లంఘన తగదని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసిన రోడ్రిగో.. ఒబామాకు ఏం తెలుసంటూ.. ఆగ్రహంగా ఒబామా తల్లిని ఉద్దేశిస్తూ బూతు మాట ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై ప్రపంచం నివ్వెరపోయింది.

పిలిప్పీన్స్ దేశాధ్య‌క్షుడు వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల అమెరికా నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఒబామా స్పందిస్తూ.. మాఫియా పేరుతో మానవహక్కుల ఉల్లంఘన తగదని వ్యాఖ్యానించారు. ఆ స‌మావేశం స్థానంలో ద‌క్షిణ కొరియా అధ్య‌క్షురాలు పార్క్ గెన్‌తో ఒబామా భేటీ అయ్యేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేశారు. పిలిప్పీన్స్ దేశాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు నెల‌ల్లోనే డుటెర్టి ప్ర‌భుత్వం సుమారు 2400 మంది డ్ర‌గ్ నేర‌స్తుల‌ను హ‌త‌మార్చింది. దీనిపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. వాస్త‌వానికి ఈ అంశాన్ని ఒబామా లావోస్ స‌మావేశంలో లెవ‌లెత్తాల‌నుకున్నారు. కానీ ఒబామా రాక‌కు ముందే డుటెర్టి ప‌రుష ప‌ద‌జాలంతో అగ్ర‌దేశాధినేత‌పై విరుచుకుప‌డ్డారు. మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించు. పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేయ‌కు, స‌న్ ఆఫ్ ఏ ఓ.. అంటూ డుటెర్టి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.
అయితే తన మాటలతో జరిగిన నష్టాన్ని గుర్తించిన రోడ్రిగో.. పశ్చాత్తాపం చెందాడట. రొడ్రిగో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు ఫిలిప్పీన్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీడియా ప్రశ్నలతో ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశారని, అందుకు బాధపడుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -