రాష్ర్టంలోని గిరిజనుల జీవితాల రూపురేఖలు మార్చడంలో గిరిజన ఇసుక సోసైటీలు (Tribal Sand Societies) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇన్నాళ్లు తమ కళ్ల ముందే ప్రకృతి ప్రసాదం ఇసుక తరలిపోతున్నా తమ అభివృద్దిలో దాని పాత్ర లేకుండేది. ఇప్పుడు ఇసుక ద్వారా తమకు లభించే అదాయంతో గిరిజన కుటుంబాల్లో అనేక సానుకూల మార్పులు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన ప్రభుత్వం గిరిజన ఇసుక సోసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు తీసుకున్నది. ఈ చర్యలు ఫలించి అర్ధిక స్వావలంభన దిశగా సంఘాల్లో భాగస్వాములుగా ఉన్న పది వేల కుటుంబాలు పయనిస్తున్నాయి. వీటి ద్వారా లభిస్తున్న డెవిడెండ్ మరియు అదాయం ద్వారా తమ కుటుంబాల విద్య, వైద్య, పౌష్టికాహార అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రకృతితో మమేకం అయిన గోదావరి తీరంలోని గిరిజన గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ది బాటలు పరుచుకుంటున్నది.
ఇసుక తవ్వకాలు జరిగే గుర్తించబడిన షెడ్యూల్డ్ ఏరియాల్లో స్ధానికులకు ఇసుక ద్వారా ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇసుక సోసైటీలను ఏర్పాటు చేస్తున్నది. భద్రాచలం, ఏటూరు నాగరం మొదలైన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మెత్తం 67 గిరిజన ఇసుక సహాకార సోసైటీలున్నారు. మెత్తం పదివేల కుటుంబాలకు ఈ సంఘాల్లో భాగసామ్యం ఉన్నది. ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న గ్రామాల్లో ఈ సోసైటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సొసైటీల్లో గ్రామాల్లోని పౌరులు కనీసం 10 నుంచి 25 మంది ఇలా వివిధ సంఖ్యల్లో సంఘాలుగా నమోదు చేసుకుంటున్నారు. మెత్తం రాష్ర్టంలోని 67 సోసైటీల్లో 44 సోసైటీల పరిధిలో ప్రస్తుతం తవ్వకాలు నడుస్తున్నాయి. మిగిలిన సోసైటీల్లో కార్యకలాపాలు ప్రారంబించేందుకు టియస్ యండిసి చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటిదాకా జిల్లా స్దాయి ఇసుక కమీటీలు (District Level Sand Committees) గోదావరి నది తీరంలో 86,08,739 క్యూబిక్ మీటర్ల(CBM)ను ఈ సోసైటీల ఇసుక తవ్వకాల కోసం గుర్తించడం జరిగింది. ఇప్పటి దాకా సూమారు 18,29,211 CBM క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వకాలు జరిపారు. ఇప్పటిదాకా టియస్ యండిసి 40,24,26,420 రూపాయాలను సోసైటీలకు ఇసుక తవ్వకాలు, లోడింగ్ ఖర్చుల నిమిత్తం చెల్లించారు. ఇలా ఇప్పటి దాకా నలబై కోట్ల రూపాయాలను ఈ సోసైటీలకు చెల్లించారు. వీటి ద్వారా ఈ గిరిజన ఇసుక సంఘాల సభ్యుల జీవితాల్లో అర్ధిక భరోసా కలుగుతున్నది.
2013 సంవత్సరానికంటే ముందుకు గ్రామంలోని మేజార్జీ గిరిజనులు కూలీ పని చేసేకునే వారు. దగ్గరలోని వ్యవసాయా క్షేత్రాల్లో మిర్చి తొడకలు తీసే పని కోసం సూమారు 75 రూపాయాలకు కూలీ పని చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వతా గ్రామంలో ప్రభుత్వం కల్పించిన ప్రచారం ద్వారా సోసైటీలను బలోపేతం చేశారు. కేవలం 110 రూపాయాలతో సభ్యత్వ రుసుముతో గిరిజనులు సభ్యులుగా సోసైటీలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఏడాది వర్షకాలం ముగిసిన తర్వతా జూన్ వరకు ఇసుక తవ్వకాల పనులు చేస్తున్నారు. క్యూబిక్ మీటర్ ఇసుక తీస్తే టియస్ యండిసి 220 రూపాయాలు చెల్లిస్తుంది. వీటిలో 40 రూపాయాలు సోసైటీలకు నేరుగా డెవిడెంట్ రూపంలో, 180 లేబర్, లోడింగ్ చార్జీల రూపంలో అధాయం వస్తుంది. ఇలా తవ్విన ఇసుకను టియస్ యండిసి రేట్లకు అమ్ముతామన్నారు. ఉదాహారణకు, ఏటూర్ నాగారంలోని మర్కాల గ్రామంలోని సోసైటీ సభ్యుల కుటుంబాలకు వార్షికంగా మెత్తం 29000 డెవిడెండ్ వచ్చిందన్నారు. ఇది తాము చేసుకునే కూలీ పనులకు అదనం అని వారు తెలిపారు. గ్రామంలోని ప్రతి సోసైటీకి 12 మంది మెంబర్లున్నారు. మెత్తం గ్రామంలో 268 కుటుంబాల నుంచి మనుషులు కూలీకి వస్తారు. ఇసుక తవ్వడం, వాహానాల్లో ఇసుక నింపడంలో ఆగ మగ కూలీలు పనిచేస్తారు. వీరికి దినసరి 600 నుంచి సూమారు 1000 రూపాయాలు వస్తున్నాయి. దీంతో గిరిజన కుటుంబాల్లో భరోసా నిండుతుందన్నది. తాము చేసుకునే కూలీకి పెద్ద ఎత్తున డబ్బులు రావడంతోపాటు వ్యవసాయం లాంటి ఇతర పనులు చేసుకునే కుటుంబాలకు సైతం వార్షికంగా డెవిడెంట్ అదాయం వస్తున్నది.
ఏటూర్ నాగారంలోని మర్కాల గ్రామానికి చెందిన కోయజాతికి చెందిన రేఖ గత రెండు సంవత్సరాల కింద అర్ధిక సమస్యలతో చదువు మానేసింది. అయితే ఈ సోసైటీలో చేరినాక తన తల్లికి వచ్చిన 29000 డెవిడెంట్ తోపాటు, కూలీ అదాయం పెరగడంతో తనను మళ్లీ పాఠశాలలో చేర్పించారని తెలిపింది. ఇలా గిరిజనులకు సోసైటీలు అందిస్తున్న అర్ధిక సహాకారాన్ని అర్ధం చేసుకోవచ్చు.
ఇసుక ప్రకృతి సంపద ప్రజలకే దక్కుతుందన్నది తమ అభిమతమని గనుల శాఖ మంత్రి కెటి రామరావు తెలిపారు. ఇప్పటికే అనేక పారదర్శక విధానాలతో ఇసుక అదాయాన్ని గనణీయంగా పెంచి, సంక్షమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని, ఈ సోసైటీలను మరింత ఎక్కువగా పెంచి గిరిజనుల సంక్షేమం కోసం పాటు పడాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. ఈ సోసైటీల ద్వారా కనీసం అదాయం లేని గిరిజనులకు ఇప్పుడు అర్ధిక భరోసా కలిగించడం తమకు అత్యంత సంతోషం ఇస్తుందని మంత్రి తెలిపారు.ఈ సోసైటీలకు ప్రభుత్వం మరింత సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నదని తెలిపారు. ఈ సోసైటీలు గిరిజనల ప్రజల జీవీతాల్లో మార్పు తీసుకు రావడంలో సాధిస్తున్న విజయం మైనింగ్ రంగంలో అదర్శవంతమైన విధానమని మంత్రి తెలిపారు.