పారాలో మెరిసిన భారత్…

571
- Advertisement -

రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ సత్తా చాటింది. పారాలింపిక్స్‌ చరిత్రలోనే భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత్‌ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది. జావెలిన్ త్రో ఎఫ్-46 ఈవెంట్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. పర్ఫెక్ట్ గా గురిచూసి జావెలిన్ విసిరాడు దేవేంద్ర. 63.67 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన దేవేంద్ర జజారియా.. సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఏథెన్స్ 2004 పారాలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించిన దేవేంద్ర జజారియా.. ఇప్పటికే పద్మశ్రీ, అర్జున అవార్డులకు కూడా ఎంపికయ్యాడు.

devendra

పారాలింపిక్స్ లో భారత్ కు ఇది నాలుగో పతకం. ఈవెంట్ స్టార్టైన రెండోరోజే హైజంప్ లో మరియప్పన్ తంగవేలు గోల్డ్ మెడల్, వరణ్ భాటీ కాంస్య పతకం సాధించారు. సోమవారం షాట్ పుట్ ఈవెంట్ లో దీపామాలిక్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది. తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్ గెల్చుకున్నాడు.

devendra

కేవలం 17 మంది సభ్యులతో పాల్గొన్న భారతజట్టు నాలుగు పతకాలు సాధించి పతకాల పట్టికలో.. భారత్ 31వ స్థానానికి ఎగబాకింది. అమెరికా 46 స్వర్ణాలతో సహా మొత్తం 121 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -