మళ్లీ పెరిగిన బంగారం ధర

127
jewel-shop-getty

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో కొట్టుమిట్టాడుతున్నా బంగారం ధర మాత్రం తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. ఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడలో బంగారం ధరలో స్వల్ప మార్పులు జరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం 40 రూపాయలు పెరిగి రూ. 47,250కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 40 పెరిగి రూ.48,450గా ఉంది.

మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర కేజీకి రూ.39పెరగగా ప్రస్తుతం కేజీ వెండీ ధర రూ.48,500 ఉంది. హైదారాబాద్‌లో 22 క్యారెట్లు రూ.40 పెరిగి రూ. 46,450కు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.40 పెరిగి రూ.50 వేల మార్కును దాటి రూ.50,660 వద్ద నిలిచింది.