టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హుజుర్ నగర్ నియోజకవర్గం జాన్ పహాడ్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో బాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి నరసింహారెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్గొండ ఎంపీగా పోటీ చేయాలన్నారు. ఎంపీగా ఓడిపోతామనే భయంతోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదన్నారు
. తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఉత్తమ్ కూడా రాజీనామా చేయాలన్నారు. ఉత్తమ్ పేరుకే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడని, కానీ ఆయన రాష్ట్రంలో ఎక్కడా తిరిగే పరిస్ధితి లేదన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందన్నారు. కేసీఆర్ చేస్తున్న ఎన్నో అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తామని స్వచ్చందంగా చెబుతున్నారని వెల్లడించారు. నల్లగొండ ఎంపీగా నరసింహారెడ్డి గెలుపు ఖాయమైందన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.