ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన విముక్తిని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఎక్సైజ్ పాలసీ దర్యాప్తులో భాగంగా జారీ చేసిన సమన్లకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా హాజరు కాలేదని ఈడీ ఆరోపించింది. ఈ విషయంపై ట్రయల్ కోర్టు జనవరి 22న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరింది.ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారించనున్నారు.
కేజ్రీవాల్ తప్పుడు కారణాలు చూపుతూ దర్యాప్తు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఈడీ వాదిస్తోంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన సమయంలో ఇతర నిందితులతో ఆయన సంబంధాలు ఉన్నాయని, ఆ పాలసీ ద్వారా వారికి లాభాలు చేకూరాయని ఆరోపించింది.అదే సమయంలో, ఈ వ్యవహారంలో అక్రమ లాభాలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరాయని కూడా ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.
ఇంతకుముందు ట్రయల్ కోర్టు….కేజ్రీవాల్ సమన్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని నిరూపించలేకపోయిందని పేర్కొంటూ ఆయనను రెండు కేసుల్లో విముక్తి చేసింది.ఇక మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్
ఇదే కేసులో ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌తో పాటు ఆయన సహచరుడు మనిష్ సిసోడియా మరియు మరో 21 మందిని ప్రధాన కేసులో నుంచి విడుదల చేసింది.సీబీఐ దాఖలు చేసిన కేసు బలహీనంగా ఉందని, న్యాయపరమైన పరిశీలనను తట్టుకోలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది.

