ఐపీఎల్ 2026 సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ప్రారంభించింది. గువాహటిలోని బర్సాపారా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై భారీ విజయం సాధించి 12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కేను రాజస్థాన్ బౌలర్లు కేవలం 127 పరుగులకే కట్టడి చేశారు. సీఎస్‌కే బ్యాటింగ్ పూర్తిగా విఫలమై, ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ మరియు రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసి సీఎస్‌కేను కుదేలు చేశారు.
128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే ఛేదించింది. 8 వికెట్ల తేడాతో గెలిచి, ఇంకా 47 బంతులు మిగిలేలా మ్యాచ్ ముగించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇన్ని బాల్స్ మిగిలిఉండగానే ఓ జట్టుకు అతిపెద్ద విజయం.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశి అద్భుతంగా ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, మొత్తం 17 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇది రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.
ఇక సీఎస్‌కే తరపున పోరాడిన జేమీ ఓవర్టన్ 36 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టుకు కొంత గౌరవప్రద స్కోర్ అందించాడు. ఇది ఐపీఎల్‌లో నెంబర్ 8 స్థానంలో సీఎస్‌కే తరఫున అత్యధిక స్కోర్‌గా నమోదైంది.
Also Read:దూబే..సీఎస్‌కేకు కీలకం కానున్నాడా?

