ఓటమితో నిరాశ చెందలేదు!

6
- Advertisement -

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్‌ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ…ఈ ఓటమితో తాను అసలు నిరాశ చెందలేదని తెలిపారు. నిజం చెప్పాలంటే ఎలాంటి నిరాశ లేదు. ప్రారంభంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం కష్టమైంది అని గైక్వాడ్ చెప్పారు.

మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో పిచ్ కొంచెం స్టికీగా మారిందని, బ్యాటింగ్ చేయడం సులభం కాలేదని గైక్వాడ్ తెలిపారు. స్పిన్నర్లకు కూడా సహకారం లభించిందని చెప్పారు.మేము ఇంకా బాగా బ్యాటింగ్ చేసి ఉంటే 150-160 పరుగుల వరకు తీసుకెళ్లే అవకాశం ఉండేది అని అభిప్రాయపడ్డారు.

Also Read:కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్

ఈ ఓటమిని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలని గైక్వాడ్ అన్నారు. మూడురోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌ను మర్చిపోయి ముందుకు వెళ్లాలి. మా జట్టులో చాలా యువ ఆటగాళ్లు ఉన్నారు. మొదటి మ్యాచ్ కాబట్టి కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ తప్పిదాలతోనే ప్రారంభించడం మంచిదే. ఇక్కడినుంచి మెరుగుదల సాధిస్తాం అని చెప్పారు.

ఇప్పటి క్రికెట్‌లో స్కోర్ ఎంత సేఫ్ అనేది చెప్పడం కష్టమని గైక్వాడ్ అన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల మ్యాచ్‌లు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టమవుతోందని చెప్పారు.బ్యాట్స్‌మన్ తమ ఆటపై నమ్మకం ఉంచాలి. మంచి బంతి వస్తే దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రోజు అది పనిచేయలేదు కానీ మేము ఇంకా మెరుగుపడగలం అని పేర్కొన్నారు. సీఎస్‌కే ఏప్రిల్ 3న తమ నెక్ట్స్ మ్యాచ్ పంజాబ్‌తో తలపడనుంది.

- Advertisement -