జబర్దస్త్ జడ్జిలు..మారారు!

1705
jabardasth judges
- Advertisement -

తెలుగు ప్రజలను నవ్వులతో ముంచెత్తిన కామెడీ షో జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ఇంత‌గా స‌క్సెస్ అయిందంటే కార‌ణం కంటెస్టెంట్‌లతో పాటు జడ్జీలు నాగబాబు,రోజా. కామెడీ వ‌చ్చినా లేక‌పోయినా వాళ్ళ న‌వ్వులు,కంటెస్టెంట్‌లపై వేసే సెటైర్లకు ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డిపోయారు. అలాంటి నాగబాబు,రోజా లేకుండా ఈ కార్య‌క్ర‌మాన్ని ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే.

అయితే ఇకపై వారిద్దరు జబర్దస్త్ స్టేజ్‌పై కనించరు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకొచ్చింది మల్లెమాల. ఏప్రిల్ 5న ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో కొత్త జడ్జీలను ఇంట్రడ్యూస్ చేసేశారు. అలనాటి నటి మీనాతో పాటు కొరియోగ్రాఫర్ శేఖర్ ఇకపై జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు జడ్జిలుగా వ్యహరించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

జబర్దస్త్ జడ్జిలైన ఫైర్ బ్రాండ్ రోజా, నాగ‌బాబు ఇప్పుడు రాజ‌కీయాల్లోనే ఉండ‌టంతో వారు ఈ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. న‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మరోసారి ఇక్కడి నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా పవన్ స్ధాపించిన జనసేనలో చేరిన మెగా బ్రదర్ నాగబాబు ఆ పార్టీ తరపున నరసాపురం ఎంపీగా బరిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో వీరిద్దరు ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో వీరి స్ధానంలో జడ్జీలుగా మీనా,శేఖర్ మాస్టర్‌ని తీసుకొచ్చింది మల్లెమాల.అయితే నాగబాబు,రోజా ఇద్దరు ఎన్నికలయ్యేంత వరకు మాత్రమే జబర్దస్త్‌కి దూరమవుతారా లేక పర్మినెంట్‌గా షో నుండి తప్పుకున్నారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -