కిషన్ నిరాహారదీక్ష ఫ్లాపేనా?

40
- Advertisement -

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల రేసులో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఓవైపు కేటీఆర్ మరోవైపు హరీష్‌ రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఈ రేసులో కాంగ్రెస్ రెండో స్ధానంలో ఉండగా బీజేపీ ఇంకా వెనుకబడే ఉంది.

బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డిని నూతన చీఫ్‌గా నియమించినప్పుడే బీజేపీ శ్రేణులు డీలా పడిపోయాయి. అప్పటివరకు జోష్‌లో ఉన్న నాయకులు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ పగ్గాలు కిషన్ రెడ్డికి కొత్త సవాల్‌ని విసిరాయి. ఓ వైపు చేరికలు లేక మరోవైపు పార్టీకి మీడియాలో ప్రాధాన్యం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌గా మిగిలిపోయిందనే చెప్పాలి.

తొలుత ధర్నాకు సాయంత్రం వరకూ అనుమతి తీసుకున్నారు. కానీ తర్వాత 24 గంటలు దీక్ష కొనసాగిస్తామని, రాత్రి కూడా ఇక్కడే ఉంటామని కిషన్ రెడ్డి చెప్పగా చివరకు పోలీసులు ఆయన్ని అక్కడి నుండి తరలించారు. దీంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్ష కొనసాగించారు. అయితే ఈ డ్రామా అంతా ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ జరిగేలా చేయాలని భావించిన కిషన్ రెడ్డి టీంకు నిరాశే ఎదురైంది. ఇక కాసేపటి క్రితమే దీక్షను విరమించారు.

Also Read:Pawan:జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వం

- Advertisement -