పాక్‌ ప్రజలు వెళ్లిపోండి..డీజీపీ ఆదేశం

11
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గావ్ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే భారత దేశం దాయాది పాక్ పై కఠిన చర్యలు తీసుకుంది. వైద్య పరమైన అవసరాల కోసం వీసాలు తీసుకున్న వారు ఈ నెల 29, మిగతా వారు ఈ నెల 27లోపు దేశం వదిలి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.

ఇక హైదరాబాద్‌కు ఎల్టీవీలపై 199 మంది రాష్ట్రానికి రాగా వీరు కాకుండా ఇంకా దాదాపు 51 మంది వివిధ వీసాలపై రాష్ట్రానికి వచ్చారు. ఒకరిద్దరు తప్ప వీరంతా తాత్కాలిక పర్యాటక వీసాలపై వచ్చిన వారే. తాత్కాలిక వీసాలపై వచ్చిన మిగతా 51 మందిని గుర్తించి వెనక్కు పంపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

పాకిస్థాన్ నుంచి వచ్చిన వారంతా తమదేశం వెళ్లిపోవాలని డీజీజీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యపరమైన వీసాలపై వచ్చిన వారు ఈ నెల 29, ఇతర వీసాలపై వచ్చిన వారు ఈ నెల 27లోగా తమ దేశం వెళ్లిపోవాలని ఆయన సూచించారు. అయితే దీర్ఘకాలిక వీసాలు, రాయబార వీసాలు, అధికారిక వీసాలపై వచ్చిన వారికి మాత్రం ఇది వర్తించదన్నారు.

Also Read:వడ దెబ్బతో 30 మంది మృతి

- Advertisement -