ఓరి వారి..నా కెరీర్ లో బెస్ట్ సాంగ్: నాని

15
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దసరా’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా కనిపించనుంది.

మాస్-ఆపీలింగ్ ప్రమోషనల్ మెటీరియల్ తో భారీ అంచనాలని నెలకొల్పింది. నాని మాసియస్ట్ ఫస్ట్‌లుక్‌ తో పాటు ఫస్ట్‌ సాంగ్‌ ధూమ్‌ధామ్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన దసరా టీజర్ నేషనల్ సెన్సేషన్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అన్ని భాషల్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది

తాజాగా మేకర్స్ దసరా సెకండ్ సింగిల్ ‘ఓరి వారి’ పాటని విడుదల చేశారు. మేకర్స్ ముందుగా చెప్పినట్లే ‘ఓరి వారి’ హార్ట్‌బ్రేక్ సాంగ్. సంతోష్ నారాయణ్ ఈ పాటని హార్ట్ టచ్చింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. మళ్ళీమళ్ళీ వినాలనిపించే పాటిది. శ్రీమణి అందిచిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రతి పదం మనసుని తాకుతుంది. ఓరి వారి పాట వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ గా ఆడియన్స్ ని అలరిచింది.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ నాని మాట్లాడుతూ..‘దసరా’ లో నాకు చాలా ఇష్టమైన పాట ఓరి వారి. నా పర్సనల్ ఫిలాసఫీకి దగ్గర వున్న పాటిది. ఒకసారి అమ్మాయి మనది కాదన్న తర్వాత కాసేపు బాధపడాలి ఇలాంటి పాటలు వినాలి. ఇంటికెళ్ళి అవ్వ ఒడిలో దూరి చంటి బిడ్డల పడుకోవాలి.(నవ్వుతూ). అదే ఈ పాట లిరిక్స్. శ్రీమణి చాలా అద్భుతంగా రాశారు. సంతోష్ నారాయణ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. విజువల్ గా ఈ పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్. మర్చి 30న స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు స్టన్ అయిపోతారు. వినే కొద్ది నచ్చే పాటిది. నెలలు తరబడి నా చెవిలో మ్రోగుతూనే వుంది. అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. దసరాకి చాలా సెలబ్రేషన్స్ ఈవెంట్స్ వుంటాయి. ‘దసరా’’ అందరం సెలబ్రేట్ చేసుకునే సినిమా’’అన్నారు.

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ..‘దసరా’ రూటేడ్ గా, నేచురల్ వుండే కథ. మా వూర్లో జరిగిన కొన్ని పాత్రల నుంచి తీసుకొని రాసుకున్న డ్రామా. నాని గారు చాలా హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు.ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.దసరా చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -