దేశంలో కరోనా చికిత్సకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన ‘విరాఫిన్’కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సలో ప్రస్తుతం రెమ్‌డెసివిర్ అనే యాంటీవైరల్ డ్రగ్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘విరాఫిన్’ అనే మరో ఔషధాన్ని కూడా కరోనా చికిత్సలో వాడనున్నారు.
ఈ ఔషధాన్ని మోతాదు లక్షణాలున్న కరోనా బాధితులకు ఇవ్వడంతో చికిత్స సులభమవుతోందని జైడస్ క్యాడిలా కంపెనీ తెలిపింది. బాధితులు త్వరగా కోలుకోవడంతో పాటు చాలా వరకు లక్షణాలు ముదరకుండా ఈ ఔషధం నిలువరిస్తోందని జైడస్ తెలిపింది. ప్రారంభంలోనే ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల వైరల్ లోడ్‌ను భారీగా తగ్గించే అవకాశం ఉందని సంస్థ ఎండీ శార్విల్ పటేల్ తెలిపారు.
‘పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బీ(PegIFN)’ శాస్త్రీయ నామం గల విరాఫిన్‌పై జైడస్ క్యాడిలా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ ఔషధం తీసుకున్న 91.15 శాతం మందిలో ఏడు రోజుల్లో వైరస్ పూర్తిగా తగ్గిపోయి నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.