ఏప్రిల్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు..

274
Elections
- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లోక్ సభ ఎన్నికలతో ముగియనుండగా.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థలైన మున్సిపాలిటీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలపై తమకేమీ అభ్యంతరం లేదని వెల్లడించింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ఎన్నికల సంఘం సమాలోచనలు చేస్తున్నదని సమాచారం. వీటిని ఈ నెల 15 నుంచి మే 20 మధ్య ముగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్థానికసంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికలసంఘం రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి అనుమతి రావడంతో స్థానికసంస్థల ఎన్నికలకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేయనున్నారు.

- Advertisement -