కొత్త వైరస్…కలకలం!

82
- Advertisement -

చైనాలో పుట్టిన కరోనాతో ఇప్పటికే ప్రపంచదేశాలు అల్లాడిపోతుండగా తాజాగా మరో వైరస్ కలకలం రేపుతోంది. జూనోటిక్ లాంగ్యా వైరస్ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

ఈ వైరస్‌ను చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో కనుకోగా తైవాన్ లో ఈ వైరస్‌ను పర్యవేక్షించడానికి, గుర్తించడానికి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. అయితే ఈ వైరస్ మనుషుల మధ్య వ్యాప్తి చెందుతుందా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని వెల్లడించారు అధికారులు.

చైనాలోకి ఈ వైరస్ 35 మందికి సోకగా ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు లేవని తెలిపారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, ఆయాసం, దగ్గు, ఆకలి మందగించడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు.

- Advertisement -