జొమాటో ఇకపై ఎటర్నల్…!

3
- Advertisement -

జొమాటో లిమిటెడ్ తన కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్ గా మార్చుకుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. కొత్త లోగోను ఆవిష్కరించడంతో పాటు, భవిష్యత్తు వ్యాపార లక్ష్యాలను వివరించారు.

దేశీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత రెండు సంవత్సరాలుగా ఎటర్నల్ పేరుతో అంతర్గతంగా వ్యవహరిస్తున్నా, ఇటీవల అధికారికంగా ఈ మార్పును అమలు చేసింది. ఈ మేరకు దీపిందర్ గోయల్ వాటాదారులకు లేఖ రాశారు. బ్లింకిట్ ను స్వాధీనం చేసుకున్న తరువాత నుండి, జొమాటో లిమిటెడ్‌ను ఎటర్నల్ లిమిటెడ్ గా పేర్కొంటున్నామని తెలిపారు. కంపెనీ బ్రాండ్, యాప్ మధ్య స్పష్టత కోసం ఈ పేరు మార్పును చేపట్టినట్లు పేర్కొన్నారు.

దీపిందర్ గోయల్ స్పష్టం చేసిన ప్రకారం, జొమాటో బ్రాండ్, యాప్ పేరు మారదు. సేవలు మునుపటిలాగే జొమాటో బ్రాండ్ కింద కొనసాగుతాయి. ఈ నిర్ణయాన్ని బోర్డు ఆమోదించిందని, వాటాదారులు సహకరించాలని కోరారు.

Also Read:వేసవిలో రాగిజావ తాగడం మంచిదేనా?

ప్రస్తుతం జొమాటో లిమిటెడ్ పరిధిలో జొమాటో (ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ), బ్లింకిట్ (నిత్యావసర వస్తువుల డెలివరీ), డిస్ట్రిక్ట్ & హైపర్ ప్యూర్ (ఇతర వ్యాపార విభాగాలు). వివిధ రంగాల్లో వ్యాపార విస్తరణను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తన పేరును ఎటర్నల్‌గా మార్పు చేసింది. రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులు, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ మార్పు దోహదపడనుంది.

- Advertisement -