టీమండియాలో పబ్ కల్చర్ : యువీ ఫైర్

264
yuvi
- Advertisement -

ప్రసుత టీమండియా ఆటగాళ్లలో పబ్ కల్చర్ పెరిగిపోయిందని…భారత క్రికెట్‌కి ఆటగాళ్లు అంబాసిడర్స్ అనే భావన మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.

తాను టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోజుల్లో జూనియర్లు ఏదైనా తప్పు చేస్తే సీనియర్‌ క్రికెటర్లు కోప్పడతారనే భయం ఉండేదని కానీ ప్రస్తుతం క్రమశిక్షణ లోపించిందన్నారు. పబ్ కల్చర్ పెరిగిపోయిందని…బాధ్యతగా ఎవరు ఉండటం లేదన్నారు.

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న రాహుల్- హార్దిక్ స్త్రీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కానీఈ వివాదం మా టైమ్‌లో అయ్యుంటే అసలు జరిగేది కాదని స్పష్టం చేశాడు యువీ.

గతంలో భారత్ సీనియర్ ఆటగాళ్లు టీమ్‌లోని జూనియర్స్‌కి చక్కగా దిశానిర్దేశం చేసేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. కానీ.. ఇప్పుడు ఐపీఎల్, సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే ఫేమ్ వస్తుండటంతో ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ తప్పుతున్నారని యువరాజ్ వెల్లడించాడు.

- Advertisement -