విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్‌ల మధ్య చెలరేగిన వివాదంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఆంశంపై యువరాజ్ స్పందించారు. వీరిద్దరి మధ్య వ్యవహారం చల్లగా ఉండాలంటే కోహ్లీ గంభీర్ ఆ శీతల పానీయం యాడ్‌కు సంతకం చేయాలని సూచించారు. యాడ్ ప్రమోషన్ కోసం గంభీర్ కోహ్లీల నుంచి సాప్ట్ డ్రింక్ సంతకం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. వారిని ఇది చల్లగా ఉంచుతుందని అన్నారు. దీనికి మీరేమంటారు? అంటూ యూవీ ఫన్నీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
Also Read: హ్యాపీ బర్త్ డే..డేవిడ్ బెక్‌హామ్
ఇక ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ స్పందించారు. గంభీర్ ప్రవర్తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్ల మధ్య జరిగే వ్యవహారంలో మెంటార్స్ కోచ్‌లు మెనేజ్‌మెంట్ జోక్యం చేసుకోకూడదని సూచించారు. కోచ్‌లు కేవలం డ్రెస్సింగ్ రూంలో కూర్చుని వ్యూహాలు రచిస్తుండాలని కానీ ఆటగాళ్ల మధ్యలోకి వెళ్లకూడదని అన్నారు. ఆటను ఆటగా మాత్రమే ఆస్వాదించాలని సూచించారు.
Also Read: హ్యాపీ బర్త్ డే..కృష్ణ పూనియా
I think #Sprite should sign #Gauti and #Cheeku for their campaign #ThandRakh
what say guys?
@GautamGambhir @imVkohli @Sprite
— Yuvraj Singh (@YUVSTRONG12) May 4, 2023