తుది శ్వాస ఉన్నంతవరకు సీఎం జగన్‌ వెంటే..

80
MLA Bhumana
- Advertisement -

మనందరి శ్వాస ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోనే ప్రయానిద్దామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 49వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

భూమన అభినయ్‌తో పాటు అతని సోదరుడు నిహార్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి,ప్రాణాపాయ స్థాతిలో ఉన్న ఇద్దరికి రక్త దానం చేసి ప్రాణాలను కాపాడారు. భూమన అభినయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్త దానశిబిరంలో సుమారు 2,000 మంది పాల్గొని, రక్తదానం చేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కేక్ కట్ చేసి, వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశంలోనే ధైర్యశాలిగా వైఎస్ జగన్ నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టిన రోజు వైసిపి అభిమానులకు పండుగ రోజు అని అన్నారు.

- Advertisement -