సెక్సీగా కనిపించాలంటే.. సమంత షాకింగ్ కామెంట్స్..

26

ఇటీవలకాలంలో టాలీవుడ్‌ బ్యూటీ సమంత తన సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఈ అమ్మడు చేసిన ‘ఊ అంటావా మావా’ ఐటం సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.. అంతేకాదు మరోవైపు అదే స్థాయిలో ఈ పాటపై విమర్శలు కూడా వచ్చాయి. మగవాళ్లను చులకన చేసేలా పాట ఉందని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ పాటలో సమంత అందాలను ఆరబోసింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా సామ్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘నేను మంచి పాత్రలూ చేశాను, చెడ్డ పాత్రలూ చేశాను, ఫన్నీగా ఉన్నా, సీరియస్ గా కూడా ఉన్నా. చాట్ షో హోస్ట్ గా కూడా ఉన్నా. నేను చేసే ప్రతి పని విజయవంతం కావడానికి ఎంతో కష్టపడి చేస్తా. అయితే సెక్సీగా కనిపించాలంటే చాలా హార్డ్‌ వర్క్‌ చేయాలి.. అది కూడా నెక్ట్స్‌ లెవల్‌లో ఉండాలి అంటూ సమంత తన ఇన్‌స్టాలో పేర్కొంది.