జగన్‌తో భేటీపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

242
YSRCP chief Jaganmohan Reddy
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో కలిసి మోదీని కలిశారు. ఈ సందర్భంగా జగన్‌ను ఆలింగనం చేసుకొన్న మోదీ భుజం తట్టారు.

YSRCP chief Jaganmohan Reddy

అనంతరం మోదీకి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను బహూకరించారు. ప్రధానిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

సుమారు గంటపాటు వీరి భేటీ జరిగింది. ఇక ఈ విషయాన్ని మోదీ తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఏపీ సీఎంగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయని అన్నారు. కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తన ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.

- Advertisement -