తెలంగాణ నుంచి కేంద్రమంత్రి పదవి ఎవరికో తెలుసా?

190
Kishan Reddy

ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో సారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 29న రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక ప్రధానితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈసారి కేంద్ర క్యాబినెట్ లోకి బీజేపీ జాతియ అధ్యక్షుడు అమిత్ షా రానున్నట్లు తెలుస్తుంది. అమిత్ షా గాంధీనగర్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక తెలంగాణ నుంచి కేంద్రమంత్రి పదవి ఎవరిని వరించనుందా అని చర్చ నడుస్తుంది.

ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూష్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా 4పార్లమెంట్ స్ధానాలు గెలిచి సత్తా చాటుకుంది. తాజా సమాచారం ప్రకారం సికింద్రబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మంత్రి వరించనున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం. కిషన్ రెడ్డి గతంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడంతో ఆయనకు ఢిల్లీ పెద్దలతో తత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ముఖ్యంగా ఆయన పేరు వినపడుతుంది.

అంతేకాకుండా ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల వద్ద కిషన్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. అలాగే నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిదర్ రావు తో ఆయన ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కి కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వీరి ముగ్గురిలో ఇద్దరికి కేంద్రమంత్రులుగా అవకాశం రానున్నట్లు తెలుస్తుంది.