పేద మహిళలకు అండగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’..

230
cm jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. తాజాగా మరో పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింద. కాపు మహిళల అభ్యున్నతి కోసం ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 24న తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా కాపు వర్గానికి చెందిన పేద మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామనీ.. అలా ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ఏపీలో కాపుల్లోనూ చాలా మంది కఠిక పేదలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవాలని భావించిన జగన్ ఎన్నికల సమయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఏడాదికి రూ.15వేలు ఇవ్వడం ద్వారా పేద కాపు వర్గం మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి వీలవుతుందని జగన్ నిర్ణయించారు. ఇప్పుడు ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఏపీలో దాదాపు 2.36 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందబోతున్నారు. సీఎం జగన్ ఈ పథకం ప్రారంభించగానే మొదటి సంవత్సరానికి గాను రూ.15వేలు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి జమ అవుతాయని సమాచారం.

- Advertisement -