ఏపీ రాజకీయాల్లోకి షర్మిల..కన్ఫర్మ్?

38
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా ? కాంగ్రెస్ తరుపున ఏపీ బాధ్యతలను భుజాన వేసుకోనుందా ? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. అయితే రాష్ట్రంలో ఆమె పార్టీకి పెద్దగా ప్రజాధరణ రాకపోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ఎలక్షన్ నుంచి తప్పుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ కు మిత్రపక్షంగానే ఉంటారా లేదా కాంగ్రెస్ లో విలీనమై హస్తం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారా అనే సందేహాలు గత కొన్నాళ్లుగా వ్యక్తమౌతున్నాయి. కాగా ప్రస్తుతం టి.కాంగ్రెస్ లో ఆమె అవసరం లేనందున ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాద్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. తాజాగా ఏపీలో కాంగ్రెస్ లో ఆమె ఎంట్రీ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని, ఆమెను కాంగ్రెస్ ఆహ్వానిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తి లేదని గతంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సౌత్ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ ఆ పార్టీ ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

Also Read:బొమ్మరిల్లు భాస్కర్…ఎస్వీసీసీ 37

- Advertisement -