ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పొడు…ఇది సినిమా డైలాగ్ అయిన ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పోచ్చు.. ఏడేళ్ల క్రితం జగన్ ఎక్కడైతే అరెస్టయ్యాడొ ఇవాళ అక్కడే సీఎంగా అధికార ట్రీట్‌మెంట్ అందుకున్నారు. 2012 మే26న అక్రమాస్తుల కేసులో జగన్ ను విచారిస్తామని చెప్పి రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్‌కుష్ గెస్ట్ హౌస్‌లో అరెస్ట్ చేశారు. ఇవాళ అదే రాజ్ భవన్ రోడ్డులో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రయాణించారు. జగన్ అరెస్ట్ కు నిరసనగా రాజ్ భవన్ రోడ్డులో నిరసన తెలుపుతున్న జగన్ భార్య భారతిని ఆరోజు అరెస్ట్ చేసిన పోలీసులే నేడు ఆమెకు సెల్యూట్ చేశారు.
వైఎస్ మరణం తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జగన్ భారతిలు మళ్లి 7సంవత్సరాల తర్వాత ఆ క్యాంప్ ఆఫీసులోకి సీఎం హోదాలోనే అడుగుపెట్టారు. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు జగన్. ఎక్కడైతే అరెస్టయ్యామో అదే రోడ్డులో జన నీరాజనాల మధ్య పోలీసులు స్వాగతం పలుకుతుంటే ఆనందపడిపోయారు జగన్ దంపతులు. వైఎస్ మరణం తర్వాత క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జగన్ నేడు అదే సీఎం హోదాలో తన తండ్రి కట్టించిన క్యాంపు ఆఫీసులోకి అడుగుపెట్టాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో భేటీ సందర్భంగా ఆయన నిన్న క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. ఇక జగన్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మీలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో చేసేందేం లేక అదే రాజ్ భవన్ రోడ్డు ఫుట్ పాత్ పై కూర్చున్న ఫోటోలను గుర్తుచేసుకున్నారు. సరిగ్గా ఏడేళ్ల క్రితం జరిగిన ఈసంఘటనను చూస్తే ఎవరికైనా జాలీ వేస్తుంది. కానీ తనకున్న పట్టుదలతో జగన్ మళ్లీ సీఎం అయ్యి అదే అధికారులతో సెల్యూట్ కొట్టించుకున్నారు.