జగన్ బయోపిక్ గా “యాత్ర2”

171
Yatra2 Movie

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర పేరుతో బయోపిక్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని సాధించింది. ఇక వైయస్సార్ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని శశి దేవిరెడ్డి, విజయ్ చల్లా లు సంయుక్తంగా నిర్మించారు. ఇక తాజాగా దర్శకుడు మహి వి. రాఘవ్ యాత్ర2 తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది.

అయితే యాత్ర2లో రాజశేఖర్ రెడ్డి గురించి కాకుండా జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్రపై తీయనున్నారట. ఇటివలే జరిగిన ఎన్నికల్లో జగన్ గ్రాండ్ విక్టరీ సాధించిన సందర్భంగా ఆయన్ను కలిసి అభినందనలు తెలియజేశారు యాత్ర మూవీ దర్శకుడు మహి వి .రాఘవ్.

ఈసందర్భంగా ఆయన ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ మిరూ భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత విజయాన్ని అందించారు అంటూ యాత్ర2 అని ట్వీట్ చేశారు. వైఎస్ మరణం తర్వాత జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర నుంచి సీఎం అయ్యే వరకూ ఈసినిమాలో చూపించనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై దర్శకుడు అధికారికంగా స్పందిచకపోయినా ఫిలీం నగర్ వర్గాల్లో మాత్రం టాక్ వినిపిస్తుంది.