ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2004ఎన్నికలకు ముందే ఆయన చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ఈసినిమాకు యాత్ర అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈమూవీలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా, వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు.
కాంగ్రెస్ నేత గౌరు చరితారెడ్డి పాత్రలో నటి అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషిని చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈమూవీ నుంచి మరో కీలక అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైఎస్ జగన్ పాత్రలో ఆయనే నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే జగన్ షూటింగ్ లో పాల్గోననున్నారని సమాచారం.