తాత కాబోతున్న అక్కినేని నాగార్జున‌..

251
nagarjuna Nagachaitanya
- Advertisement -

అక్కినేని నాగార్జున త్వ‌ర‌లోనే తాత కాబోతున్నాడు. ఈవార్త ప్ర‌స్తుతం టాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అది రియ‌ల్ లైఫ్ లో కాదు లేండి రీల్ లైఫ్ లోనే. ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున సొగ్గాడే చిన్నినాయ‌న సినిమాకు సిక్వేల్ గా బంగార్రాజు సినిమాను తెర‌కెక్కించ‌నున్నార‌న‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ స్క్రీప్ట్ ప‌నిలో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

nagarjuna Director Kalyan Krishna

అయితే ఈసినిమాలో నాగార్జున తాత గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అది కూడా నాగ‌చైత‌న్య‌కు తాత గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి. దేవ‌దాసు సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న నాగ‌ర్జున ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమా బ్ర‌హ్మాస్త్ర‌తో పాటు మ‌రో మ‌ల‌యాళం మూవీలో న‌టిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నుంచి బంగార్రాజు మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తుంది.

- Advertisement -