తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన సందర్భంగా డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. గంటపాటు సాగిన ఈభేటీలో దేశ రాజకీయాలపై సుదీర్ఘ చర్చ జరిపినట్లు సమాచారం. ఇక ఈ భేటీలో ఏపీలో జగన్ గెలవడం ఖాయమని స్టాలిన్‌తో కేసీఆర్ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
మీరు అనుకుంటున్నట్లుగా చంద్రబాబు గెలవడం లేదని వైసీపీ విజయం సాధిస్తుందని కేసీఆర్ చెప్పారట. స్టాలిన్-కేసీఆర్ సమావేశం అనంతరం డీఎంకే నేత ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్-స్టాలిన్ భేటీ వివరాలపై ఆరా తీశారు చంద్రబాబు.ఇక డీఎంకే నేత చెప్పిన సమాధానాలతో బాబు చిన్నబోయినట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ 18 నుండి 21 ఎంపీ సీట్లు జగన్‌కు వస్తాయని కేసీఆర్..స్టాలిన్‌కు చెప్పారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది జగనే అని తెలిపారని బాబుకు మురుగన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇక స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయిన రెండు రోజులకే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నుండి జగన్,కేసీఆర్‌లకు ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటుచేసే సమావేశానికి హాజరుకావాలని లేఖ అందడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. మొత్తంగా ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుకు షాక్ తగలడం ఖాయమని టీఆర్ఎస్ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.