డ్రగ్స్‌ కేసు.. ఎవ్వరినీ వదలం

246
drugs case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌కేసులో సిట్ మరో నాలుగు ఛార్జిషీట్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఛార్జిషీట్స్‌లో సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో వారిని వదిలేసినట్లేనని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందిచారు.

డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. సినీ నటులు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదన్నారు.డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఐదుకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు.

ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని పూర్తి ఆధారాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తమకు లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు అభియోగ పత్రాలు దాఖలుచేసి కోర్టుకు సమర్పిస్తున్నాం తప్ప ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు 62 మందిని పోలీసులు విచారించారు.