చిరు మెసేజ్‌కి షాకైన మహేష్‌..!

296
mahesh chiranjeevi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి. విడుదలైన ప్రతిచోటా సక్సెస్ టాక్‌తో వసూళ్ల సునామీతో దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సందర్భంగా మహర్షి సక్సెస్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు నిర్మాత దిల్ రాజు,సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌,దర్శకుడు వంశీతో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మహర్షి కాన్సెప్ట్‌కు ఫిదా అయ్యారని మహేష్ చెప్పారు. సినిమా చూసి తనకు చిరంజీవి పెద్ద మెసేజ్ చేశారని తెలిపారు. ఒక్కడు సినిమా నుండి భరత్ అనే నేను వరకు తన ప్రతి సినిమాకు ఆయన ఇచ్చే మెసేజ్ మర్చిపోలేనని చెప్పారు. చిరంజీవి తనకు విషెస్ చెప్పారని చెప్పేలోపే వంశీ ఆయనే తనకు కాల్‌ చేశారని చెప్పడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.

సినిమా గురించి 5 నిమిషాలు మాట్లాడారని అది ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి అన్నారు. చిరంజీవిని చూసి పెరిగామని ఆయన్ని ఆరాధించామని అలాంటి మెగాస్టార్ ఫోన్ చేసి విషెస్ చెప్పడం ఎప్పటికి గుర్తుండి పోతుందన్నారు. మంచి సినిమా తీస్తే అభినందించాలనే కాన్సెప్ట్‌,యాట్యిట్యూడ్ ఉండటం గొప్ప విషయమన్నారు. ముఖ్యంగా వీకెండ్ అగ్రికల్చర్ పాయింట్ అద్భుతంగా ఉందని చిరంజీవి చెప్పారని తెలిపారు వంశీ.