ఈ హీరో రెమ్యూనరేషన్ ఆరు లక్షలే…

239
young-hero-hikes-remuneration-by-6-times
young-hero-hikes-remuneration-by-6-times
- Advertisement -

నాని నటించిన ఎవడే సబ్రమణ్యం మూవీతో తెరంగేట్రం చేశాడు విజయ్ దేవరకొండ. తనదైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనుసులో చోటుసాధించాడు. రీసెంట్ గా వచ్చిన పెళ్లిచూపులు మూవీ అనూహ్య విజయంతో ఈ యువ హీరో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోయాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి విజయ్‌ తీసుకున్న పారితోషికం కేవలం 6 లక్షల రూపాయలు. ఆ తర్వాత నటించిన పెళ్లి చూపులు మూవీకి కూడా విజయ్‌ రెమ్యునరేషన్‌ ఆరు లక్షలేనట.

pallichoopulu

ఇక త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ద్వారకా, అర్జున్‌ రెడ్డి సినిమాలకు విజయ్ 20 లక్షలు తీసుకున్నాడట. అయితే ఆ సినిమాలు అంగీకరించే సమయానికి పెళ్లిచూపులు మూవీ ఇంకా విడుదల కాలేదు. అయితే ఆ సినిమా విడుదలై, మంచి హిట్ అవ్వడంతో హీరోగా విజయ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ హీరో రెమ్యూనరేషన్ కూడా కోటికి చేరువైంది. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో విజయ్‌ ఓ హారర్‌ కామెడీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం 80 లక్షల పారితోషికం తీసుకుంటున్నాడట.

Vijay Devarakonda, Ritu Varma @ Pelli Choopulu Movie Audio Launch Stills

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇకపై అంగీకరించే సినిమాలకు కోటిన్నర వరకు అడగాలని డిసైడ్‌ అయ్యాడట. విజయ్ కంటే ముందు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు ఇంకా కోటి దగ్గరే ఉండిపోయారు. హిట్లు లేకపోవడమే ఇందుకు కారణం. కానీ, ఒక్క హిట్ తో విజయ్ వాళ్లందరిని బీట్ చేస్తున్నాడు. మరీ, ఈ హీరో కెరియర్ మునుముందు ఎలా సాగుతుందో చూడాలి.

- Advertisement -