ఆ హీరోయిన్ తో కుర్ర హీరో డేటింగ్ ?

111
- Advertisement -

వరుసగా ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో ఇప్పుడిప్పుడే సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న కుర్ర హీరోయిన్ ఇద్దరూ కలిసి డేటింగ్ చేస్తున్నారని టాలీవుడ్ ఇన్సైడ్ న్యూస్. ఈ యంగ్ హీరో వెంటే ఎప్పుడూ కుర్ర హీరోయిన్ కనిపిస్తున్నారట. ఎక్కడ చూసినా ఈ ఇద్దరే కనిపిసస్తుండటంతో ఈ ఇద్దరి మేటర్ తాజాగా బయట పడిందట.

అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు గాసిప్స్ పుట్టుకొస్తాయి. నిప్పు లేనిదే పొగ రాదని చాలా వార్తలు రుజువు చేశాయి. తాజాగా ఈ కుర్ర జంట కూడా వార్తల్లో నిలుస్తుంది. ఈ మధ్యే ఈ ఇద్దరూ ఓ వెబ్ సిరీస్ కోసం కలిశారు. అంతకు ముందే ఇద్దరికీ పరిచయం ఉండటం ఇప్పుడు మరింత క్లోజ్ అయ్యారట. సిరీస్ ప్రమోషన్స్ లో కూడా మీడియా ముందు చాలా క్లోజ్ మూవ్ అయ్యారు. ఇక ఈ యంగ్ హీరో మీద ఇప్పటికే చాలా పెళ్లి రూమర్లు వచ్చాయి. అవన్నిటినీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు.

ఇప్పుడు ఈ కుర్ర హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తూ ఆమెతో డేటింగ్ చేస్తున్నాడట. ఇద్దరూ కలిసి కాఫీ షాపులకు, షాపింగ్ మాల్స్ కి చక్కర్లు కొడుతున్నారట. కానీ ఈ హీరోతో పోలిస్తే హీరోయిన్ దే కాస్త పై చేయి. ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్ గ్రౌండ్ కి చెందిన అమ్మాయి. టాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్న ఓ ఫ్యామిలీ నుండి వారసురాలిగా ఇండస్ట్రీకి ఇటీవలే పరిచయమైంది. అందుకే యంగ్ హీరో ఆమెను బుట్టలో వేసుకున్నట్టున్నాడు. మరి ఈ కుర్ర జంట పెళ్లి పీటలెక్కుతారా ? లేదా జస్ట్ టైం పాస్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

కేరళలో అవతార్‌-2 ప్రదర్శన నిలిపివేత

సీక్వెల్ తో  ‘హిట్’ కొడతాడా ?

ప్చ్.. ఇలా పెంచేస్తే ఎలా అమ్మడు ?

- Advertisement -