కేరళలో అవతార్‌-2 ప్రదర్శన నిలిపివేత

156
- Advertisement -

అవతార్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజీ సంపాదించుకుందో మనందరికీ తెలుసు. అయితే అవతార్‌-2 ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్న వేళ కేరళలో ఎదురుదెబ్బ తగిలింది. కేరళలో ఈ సినిమాను ప్రదర్శించకూడదని అక్కడి ది ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ (ఎఫ్‌ఈయూఓకే) నిర్ణయించింది.

ఎఫ్‌ఈయూఓకే అధ్యక్షుడు కే. విజయ్‌కుమార్ మాట్లాడుతూ… కేరళలో సినిమాలను బ్యాన్‌ చేస్తామని చెప్పడం లేదు. కానీ అవతార్ సినిమాను మాత్రం ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందులో లాభాల వాటాలపై చర్చలు సఫలం కాలేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. థియేటర్స్‌ ఓనర్స్‌, డిస్ట్రీబూట్యర్స్‌ ల మధ్య ఒప్పందం కాకపోవడమే కారణమని తెలిపింది. కానీ మిగిలిన సినిమాలు మాత్రం కేరళ వ్యాప్తంగా ప్రదర్శితమవుతాయని ప్రకటించారు.

డిస్టిబ్యూటర్స్‌, థియేటర్స్‌ ఓనర్స్‌ మధ్య అవాతార్‌ సినిమా కోసం డిస్టిబ్యూటర్స్‌ మొదటి వారంలోని కలెక్షన్లలలో 60 శాతం లాభాలను అడుగుతున్నారని కానీ ఓనర్స్‌ మాత్రం కేవలం 55 శాతం లాభాలు ఇస్తామని చెప్పడంతో ఒప్పందము కుదరలేదని అన్నారు. జేమ్స్‌ కామెరున్ నిర్మించిన అవతార్‌-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 16న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…

ప్చ్.. ఇలా పెంచేస్తే ఎలా అమ్మడు ?

సీక్వెల్ తో  ‘హిట్’ కొడతాడా ?

సామ్‌…చికిత్సకు సౌత్‌కొరియా..!

- Advertisement -